హైదరాబాద్: 28°C
వార్తలు

మయన్మార్‌లో భూకంపం

మయన్మార్‌, త్రిపురలో భూకంపాలు సంభవించాయి. మయన్మార్‌లో రిక్టర్‌ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. త్రిపురలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు, ప్రకంపనల ప్రభావంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.