హైదరాబాద్: 28°C
వార్తలు

43వ అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు 43వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనం పైనుంచి అత్యంత వేగంగా కింద పడటంతో ఆ యువకుడి శరీరం రెండు ముక్కలుగా ఛిద్రమైంది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.