హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మాంసం, మద్యం బంద్‌

TG: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు మాంసం, బీఫ్‌ దుకాణాలను, కబేళాలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది. స్టాండింగ్‌ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ కర్ణన్‌ పేర్కొన్నారు. అలాగే, మద్యం షాపులను కూడా బంద్‌ చేయాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.