హైదరాబాద్: 28°C
వార్తలు

అంటరానితనంపై పోరాడిన 'బ్రహ్మర్షి'

ప్రముఖ విద్యావేత్త, గొప్ప సంఘ సంస్కర్త 'బ్రహ్మర్షి' రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి నేడు. 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో ఆయన జన్మించారు. బ్రహ్మసమాజ స్ఫూర్తితో అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళల విద్యాభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు. మూఢనమ్మకాలను పారద్రోలి, సమాజంలో మార్పు కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రలో ఆయన స్థానం సుస్థిరం.