హైదరాబాద్: 28°C
వార్తలు

100 వసంతాల సేవలు.. రక్షకులకే దేవుళ్లు!

దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు అండగా నిలిచే నర్సుల సేవలను స్మరించుకుంటూ అక్టోబర్ 1న 'మిలిటరీ నర్సింగ్ సర్వీస్(MNS) డే' జరుపుకుంటారు. 1926 అక్టోబర్ 1న ఏర్పాటైన ఈ విభాగం నేటితో వందేళ్లు పూర్తి చేసుకుంది. యుద్ధభూమిలో గాయపడిన జవాన్లకు ప్రాణదానం చేస్తూ, శాంతి సమయంలోనూ నిరంతరం వైద్య సేవలందిస్తున్న నర్సుల అంకితభావానికి ఈ రోజున యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.