హైదరాబాద్: 28°C
వార్తలు

శివాజీ పార్క్‌లోనే సీజేపీ నిరసన: ఆశుతోష్

కాక్రోచ్ జంతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 2న చేపట్టే నిరసన ముంబైలోని శివాజీ పార్క్‌లోనే జరుగుతుందని ఆ పార్టీ సహ సమన్వయకర్త ఆశుతోష్ రంకా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన ఎక్స్‌‌ (ట్విట్టర్) వేదికగా కోరారు. రాబోయే రోజుల్లో ఇతర నగరాల్లోనూ కార్యక్రమాలు చేపడతామని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రంకా తెలిపారు.