హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరణిలో భూమి వివరాలు సరిచేయాలని వినతి

NGKL: తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన నారంజి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో తన భూమి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 215/ఇలో 0.34 గుంటల భూమి ఉండగా ధరణిలో 0.11 గుంటలు మాత్రమే తన పేరుతో నమోదైందని తెలిపారు. మిగిలిన భూమిని తన పేరుతో నమోదు చేసి పట్టాదారు పాస్ బుక్ జారీ చేయాలని కోరారు.