హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైల్వే కార్మికుల సమస్యలపై నిరసన'

MHBD: జిల్లా కేంద్రంలో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే వర్కింగ్ యూనియన్ సెక్రటరీ యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ.. రైల్వే కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి కార్మికులపై పడుతున్న అదనపు పనిభారం తగ్గించాలని కోరారు.