GDWL: ఉండవెల్లి మండలానికి చెందిన సుజాత తన భర్త ఈరన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరున ఉన్న 4.20 ఎకరాల భూమిని రెండో భార్య పిల్లల పేరుతో మార్చాలని భర్త వేధిస్తున్నట్లు ఆరోపించింది. మద్దెలబండలో కట్నం డబ్బులతో కొనుగోలు చేసిన భూమి విషయంలో మానసికంగా వేధిస్తున్నారని తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
తెలంగాణ
భూమి కోసం వేధింపులు.. భర్తపై కేసు


