హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే పీడీయాక్ట్

VKB: నిర్ణీత రేట్ల కంటే అధికంగా విత్తనాలు, ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని మోమిన్‌పేట AO రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ వివరాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.