హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మురుగు నీటితో 100 ఫీట్ల రోడ్డు అతలాకుతలం'

హన్మకొండ నగరంలోని 100 ఫీట్ల రోడ్డు నిత్యం మురుగు నీటితో చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వడ్డేపల్లి చెరువు కరకట్ట దిగువన సమస్య ఉన్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.