SRPT: నడిగూడెం మండలంలోని వేణుగోపాలపురం ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాగిత రామచంద్రపురం నుంచి వేణుగోపాలపురం వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ గంజాయి వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. స్థానికులు 108లో నడిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
తెలంగాణ
ఆటోను ఢీకొట్టిన కారు


