హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారథాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వేల్పూర్ క్రీడాకారుడు

NZB: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో వచ్చే ఏడాది జనవరి 24న నిర్వహించనున్న మారథాన్‌కు NZB జిల్లా వేల్పూర్‌కు చెందిన జాతీయస్థాయి క్రీడాకారుడు గుగ్గిలం అశోక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అశోక్‌ సంతోషం వ్యక్తం చేశారు. రక్తదానంపై అవగాహన కల్పించడమే మారథాన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలంగాణలోని రన్నర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.