హైదరాబాద్: 28°C
తెలంగాణ

OCT 9న సికింద్రాబాద్ డివిజన్‌లో 'డాక్ అదాలత్'

HYD: పోస్టల్ సేవల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి సికింద్రాబాద్ పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో OCT 9న ఉదయం 11 గంటలకు 'డాక్ అదాలత్' జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల ప్రజలు తమ సమస్యలను ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌తో జతచేసి అక్టోబర్ 6వ తేదీలోగా సికింద్రాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపాలని అధికారులు సూచించారు.