హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ నీటి నిల్వ ఎంతంటే?

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 46.654 టీఎంసీలకు చేరింది. మంగళవారం ఉదయం 6 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1080.60 అడుగులుగా ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరగా, వివిధ అవసరాల కోసం 2,157 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.