హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-15 ప్రాబబుల్స్‌లో జాహ్నవికి చోటు

జనగామలోని శ్రీధర్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ పొందుతున్న ఆకుల జాహ్నవి క్రికెట్‌లో ప్రతిభ చాటింది. ఆగస్టు 27న వరంగల్‌లో హెచ్‌సీఏ నిర్వహించిన అండర్-15 ఉమెన్స్ ఓపెన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హెచ్‌సీఏ అండర్-15 ఉమెన్స్ టీమ్ ప్రాబబుల్స్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, కోచ్‌లు, ఆమెను అభినందించారు.