హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలోకి వరద నీరు.. విద్యార్థులకు ఇబ్బందులు

JGL: మెట్‌పల్లి పట్టణం ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణ నాలుగు రోజులుగా వర్షపు నీటితో నిండిపోయింది. పాఠశాల చుట్టూ నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు మధ్యలో రెండు నెలల క్రితం బల్దియా అధికారులు గట్టు ఏర్పాటు చేయడంతో వరద నీరు పాఠశాల వైపు వస్తోందని స్థానికులు చెబుతున్నారు.