హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చగా మారిన చెరువు నీరు.. గ్రామస్థుల్లో ఆందోళన

KNR: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి ఊర చెరువు నీరంతా పచ్చగా మారడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సర్పంచ్ తిరుపతిగౌడ్ తెలిపారు. చెరువు నీటిని కరీంనగర్‌లోని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు, నివేదిక వచ్చిన తర్వాత కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.