హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి చోరీతో..తప్పని ఇబ్బందులు

WGL:నల్లబెల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ కాలనీలో నీటి చోరీ కారణంగా తాగునీటి సమస్య నెలకొంది. కొందరు ప్రధాన పైపులైన్లకు అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దీంతో కాలనీలో 80 శాతం కుటుంబాలకు సక్రమంగా నీరు అందడం లేదన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం బాధాకరమని ప్రజలు పేర్కొన్నారు.