హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

MNCL: నస్పూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నస్పూర్ గేట్ వద్ద లారీ, ఆటో ఢీ కొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.