హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

జగిత్యాల రోడ్డులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్ రోడ్డు పై ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి బస్సు ముందు టైర్ కింద పడిపోయాడు. బస్సు తన కాలు పై నుంచి వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 108 సహయంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.