హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిక్షణతోపాటు ఉద్యోగం.. నిరుద్యోగులకు ఛాన్స్‌..!

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా నిరుద్యోగ యువతకు ఓ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ లక్ష్మి తెలిపారు. డేటా ఎంట్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సోలార్‌ ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణతోపాటు ఉద్యోగం కల్పిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. శిక్షణ అనంతరం NSDC సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు.