హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలతో పత్తి రైతులకు భారీ నష్టం

NRPT: అకాల వర్షాలు పత్తి రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. పంట తడిసి నాణ్యత తగ్గడంతో తుఫాన్‌కు ముందు క్వింటా రూ.10,500 ఉన్న ధర ప్రస్తుతం రూ.8,200కు పడిపోయింది. గద్వాల జిల్లాలో మల్దకల్‌లో 27,488, గట్టులో 21,525, మానవపాడులో 21,485 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.