హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాలకు అడ్డాగా కొక్కిరేణి – తాళ్లచెరువు రహదారి..!

KMM: తిరుమలాయపాలెం మండలంలో కల్వర్టు పనుల నిర్లక్ష్యంతో కొక్కిరేణి – తాళ్లచెరువు రహదారి ప్రమాదకరంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ. 3 కోట్లతో శంకుస్థాపన చేసిన పనులు సాగడం లేదు. ప్రత్యామ్నాయ దారి, బోర్డులు లేకపోవడంతో బురద రోడ్డుపై వాహనదారులు పడి గాయపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రహదారిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.