హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దోమకు అదనపు బస్సులు నడపాలి'

VKB: దోమ మండలంలో ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగి–దోమ మార్గంలో తగినన్ని బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, రోగులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని స్థానికులు కోరుతున్నారు.