NLG: నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటంకు చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు దాసరి సైదులు, బీజేపీ వార్డు సభ్యుడు ఓరుగంటి వేణు సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్న వారికి సముచిత గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో ఏపీ లింగోటం వార్డు సభ్యుల చేరిక


