RR: షాద్‌నగర్‌లో జింక మాంసం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న 8 మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో 13 కిలోల జింక మాంసం, వేటకు ఉపయోగించిన రైఫిల్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
షాద్‌నగర్‌లో జింక మాంసం పట్టివేత


