హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైబ్రరీలో పాముల భయం.. విద్యార్థులు ఆందోళన

SRD: ​సిర్గాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. ప్రాంగణం శుభ్రంగా లేకపోవడంతో నిత్యం పాములు వస్తున్నాయని, లోపల మరో రెండు పాములు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా జీపీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎవరికైనా ప్రమాదం జరిగే వరకు చూస్తారా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.