హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరాలి: కలెక్టర్

MDK: జిల్లాలో అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. దిశ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన సూచనలు, ఆదేశాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వచ్చే దిశ సమావేశం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు.