ADB: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి గణేశ్వర్ రావ్ సోమవారం తెలియజేశారు. ఈ మేళాలో హరేకృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ కంపెనీలో 67 ఖాళీలు, ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 34 ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలోనే ఉద్యోగం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'


