హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభం, తీగలకు అల్లుకున్న చెట్లు

JN: రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి–భాంజీపేట గ్రామాల మధ్య కల్వర్టు వద్ద విద్యుత్ స్తంభం, తీగలకు చెట్లు అల్లుకున్నాయి. ఈ స్తంభం నుంచి వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ సరఫరా అవుతోంది. స్తంభం పక్కనే నియంత్రిక ఉండటంతో వర్షం, గాలికి చెట్ల కొమ్మలు విరిగి తీగలు, స్తంభం, నియంత్రికపై పడితే విద్యుదాఘాతం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.