HNK: హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని SRSP కాలువ వద్ద దారుణ హత్య జరిగింది. కమలాపూర్ మండలం ఉప్పలపల్లికి చెందిన రాకేశ్‌ను అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. పాత కక్షలే ఘటనకు కారణమని తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: SRSP కాలువ వద్ద దారుణ హత్య


