హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేటితో ఆఖరి గడువు'

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎం.ఎడ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇప్పటికే ముగిసింది. రూ.100 అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడు చివరి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫీజుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.