హైదరాబాద్: 28°C
వార్తలు

ఆహార ధరలపై ఎల్ నినో ఎఫెక్ట్!

దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరి, చెరకు, పత్తి వంటి పంటల దిగుబడి తగ్గి ఆహార ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక శాతం వర్షపాతం తగ్గుదలతో ఆహార ద్రవ్యోల్బణం 25 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కేంద్రం రాయితీపై ఉల్లిపాయలను విక్రయిస్తోంది.