హైదరాబాద్: 28°C
వార్తలు

‘17 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం..!’

ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్-సెప్టెంబర్ సీజన్‌లో సాధారణం కంటే 15% తక్కువ వర్షపాతం నమోదైందని తాజాగా IMD తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2009 తర్వాత అత్యంత పొడి వర్షాకాలం ఇదే అవుతుందని అభిప్రాయపడింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ కొంత మేర లోటును భర్తీ చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు.