హైదరాబాద్: 28°C
వార్తలు

LoC ట్రేడ్ బంద్.. టూరిజం షురూ

జమ్మూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK) మధ్య వాణిజ్యం కోసం ఉరీలో ఉన్న క్రాస్-ఎల్ఓసీ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్(TFC) అధికారికంగా మూతపడింది. భద్రతా కారణాలతో 2019 నుంచి ఇక్కడ వాణిజ్యం నిలిచిపోయింది. తాజాగా దీనిని పర్యాటక శాఖకు అప్పగిస్తూ J&K ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దు టూరిజాన్ని ప్రోత్సహించి, యువతకు ఉపాధి కల్పించేందుకు దీనిని టూరిజం హబ్‌గా మార్చనున్నారు.