హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

TG: ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా కోర్టు ముందు హాజరై విచారణను ఎదుర్కొననున్నారు. కేటీఆర్‌ హాజరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.