హైదరాబాద్: 28°C
వార్తలు

అలాంటి వదంతులు నమ్మకండి: PIB

ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పథకం నోటిఫై చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని చెప్పింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించింది.