హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PLD: చిలకలూరిపేటలోని పలు వార్డుల్లో రూ.1.15 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. అలాగే పారిశుధ్య కార్మికులకు రూ.10 లక్షల విలువైన చెత్త సేకరణ బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు రూ.52 కోట్లు మంజూరయ్యాయని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్-10లో నిలిపేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.