BPT: చిన్నగంజాం (మం) పరిధిలోని మోటుపల్లి, చిన్నగంజాం, పెదపల్లెంపాలెం, పెదగంజాం పల్లెపాలెం ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన వసతులను సిద్ధం చేశారు. తహసీల్దార్ జే. ప్రభాకరరావు, ఎంపీడీవో కే.ధనలక్ష్మి, ఏఈపీఆర్ దాస్, ఇతర సిబ్బందితో కలిసి పరిశీలించారు.
వార్తలు
వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు


