ప్రకాశం: గిద్దలూరులోని ఇస్లాంపేటలో కొద్దిసేపు కురిసిన వర్షానికే మురుగు కాలువలు పొంగి మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమలబెడద పెరిగి అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. సమస్యపై పలుమార్లు విన్నవించినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: చిన్నపాటి వర్షానికి మురుగునీరు రోడ్లపైకి


