హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారులు

ADB: భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. గుంతలలో నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.