హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలపై దాడులను సహించం: కాంగ్రెస్

కర్నూలులో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా కాంగ్రెస్ ఫౌండేషన్ డే వేడుకలను నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళల హక్కులు, సాధికారత, సమానత్వం కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని ఆమె తెలిపారు. మహిళలపై దాడులను సహించేది లేదని, వారి సమస్యలపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు.