హైదరాబాద్: 28°C
వార్తలు

స్వతంత్ర భరద్వాజ్ కస్టడీ పొడిగింపు

సీజేపీ నిరసనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ జ్యూడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడిని న్యాయస్థానం ముందు పోలీసులు హాజరపరిచారు. దీంతో విచారణ జరిపిన కోర్టు కస్టడీని పొడిగించి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.