జ్ఞానానికి, ఆర్థికాభివృద్ధికి మన పల్లెలు మూలకేంద్రాలు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఒకప్పుడు మన గ్రామాలన్నీ స్వయం పోషకాలుగా ఉండేవని గుర్తు చేశారు. అందుకే గ్రామాలకు తరలండి.. అంటూ గాంధీజీ పిలుపునిచ్చారని చెప్పారు. పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం.. జాతి నిర్మాణానికి సాయం చేయడమేనని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా భారతీయులం అంటూ గర్వంగా చెప్పుకోవాలని పేర్కొన్నారు.
వార్తలు
అందుకే గాంధీజీ ఆ పిలుపునిచ్చారు: సీఎం


