హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తరాదికి, దక్షిణాదికి వారధిగా వెంకయ్యనాయుడు: యోగి

స్వర్ణభారత్ ట్రస్ట్‌లో విద్యతో పాటు నైపుణ్య శిక్షణనూ అందిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. గ్రామీణ యువత, మహిళలకు ఈ ట్రస్ట్‌లో ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ 25 ఏళ్లుగా సేవలు అందించటం అభినందనీయమని కొనియాడారు. సమాజసేవకు వెంకయ్యనాయుడు తీసుకున్న సంకల్పం గొప్పదని కితాబిచ్చారు. ఉత్తరాదికి, దక్షిణాదికి వారధిగా ఆయన పని చేశారని ప్రశంసించారు.