హైదరాబాద్: 28°C
వార్తలు

అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదు: విజయ్

తమ ప్రభుత్వం విమర్శలపై దృష్టి పెట్టబోదని.. అభివృద్ధికి పెద్దపీటవేయడమే తమ లక్ష్యమని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదని పునరుద్ఘాటించారు. అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాకప్ నేరాలు సాధారణమైనవి కావని.. ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్ ద్వారా పారదర్శక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.