హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలను అవమానిస్తే చట్టం ఊరుకోదు: విజయ్‌

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నామో ప్రతిఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. 'కొందరు మాట్లాడేటప్పుడు ద్వంద్వార్థం వచ్చే పదాలను ఉపయోగిస్తున్నారు. మనందరి ఇళ్లలో తల్లి, అక్కా చెల్లెళ్లు ఉన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని తెలిపారు.