హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆటో ర్యాలీ

KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ర్యాలీని ప్రారంభించి, స్వయంగా ఆటో నడిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ వినూత్న ఫ్లెక్సీలతో నిరసన తెలిపి, ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని స్పష్టం చేశారు.