హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వారపు సంతల్లో సౌకర్యాల కరువు.!

ADB: గాదిగూడ మండలం లోకారి(కే)లో ప్రతి ఆదివారం జరిగే వారపుసంతకు మారుమూల గ్రామాల ప్రజలు, వ్యాపారులు వస్తుంటారు. విక్రయదారుల నుంచి వారానికి రూ. 30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నా, కనీసం శాశ్వత షెడ్లు లేకపోవడంతో తాత్కాలిక షెడ్లతో వ్యాపారం చేస్తున్నారు. ఎండ, వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నార్నూర్‌లో ప్రతి బుధవారం జరిగే సంతలోనూ ఇదే పరిస్థితి ఎర్పడుతోంది.